Munugodu Bypoll : మరింత హీటెక్కిన మునుగోడు రాజకీయాలు..

Munugodu Bypoll : మరింత హీటెక్కిన మునుగోడు రాజకీయాలు..
Munugodu Bypoll : వినాయక నిమజ్జనం ముగియడంతో ప్రధాన పార్టీల నేతలు మునుగోడు బాట పడుతున్నారు

Munugodu Bypoll : మునుగోడులో పొలిటికల్‌ హీట్‌ మరింత పెరిగింది.వినాయక నిమజ్జనం ముగియడంతో ప్రధాన పార్టీల నేతలు మునుగోడు బాట పడుతున్నారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌ తన అభ్యర్థిని ఖరారు చేయడం,బీజేపీ అభ్యర్ధిగా దాదాపు రాజ్‌గోపాల్‌ రెడ్డే బరిలో నిలవడంతో టీఆర్‌ఎస్‌ కూడా లోకల్‌ క్యాడర్‌ను సమాయత్తం చేస్తుంది.రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి నెలరోజులు అవుతున్నా, ఆ పార్టీ నేతలతో సమన్వయం లేకుండాపోయింది. దీంతో మునుగోడులో బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించింది.బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్‌తో పాటు సీనియర్‌ నేతలు వివేక్ వెంకటస్వామి,ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం చేయాల్సిన గ్రౌండ్ వర్క్ పై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

కార్యకర్తల సమావేశంలో ఉప ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.రాష్ట్రంలో దోపిడి ఏ విధంగా జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని,ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని రాజ్‌గోపాల్‌రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం వేరని ఇప్పుడు జరుగుతుంది వేరని, ధర్మయద్ధంలో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు.

ఇక సమ్మేళనాల తర్వాతే టీఆర్‌ఎస్‌ ప్రచారంఈ నెల 15వ తేదీ నుంచి మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మునుగోడుకు వెళ్లాల్సి ఉంటుందని, మండలాలు, గ్రామాలవారీగా నేతల జాబితాను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. అయితే ఈ జాబితాను సీఎం కేసీఆర్‌ అధికారికంగా ఖరారు చేయకపోవడం, వర్షాలు కురుస్తుండటంతో అధికార పార్టీ నేతల మునుగోడు ప్రచారంలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెనిపిస్తోంది.. అయితే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంబోత్సవాలతో బీజిగా ఉన్నారు జిల్లా మంత్రి జగదీష్‌ రెడ్డి. ఇక దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ.. కేంద్రంలోని బీజేపీ పార్టీ దేశ ద్రోహానికి పాల్పడుతోందని...అలాంటి పార్టీలో చేరి రాజగోపాల్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోయడంటూ రాజగోపాల్‌ రెడ్డిపై విమర్శానాస్త్రాలు గుప్పిస్తున్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి.

మరోపక్క కాంగ్రెస్‌ కూడా ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలకు పదునుపెడుతోంది.మునుగోడులో ఐదు దశబ్ధాలుగా పాల్వాయి కుటుంబం పని చేసిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పల్లె రవికుమార్, కైలాష్, కృష్ణారెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వీరి స్ఫూర్తితో మిగితా నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మరోపక్క సిఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి. తనను అభ్యర్ధిగా ప్రకటించిన నేపధ్యంలో నియోజకవర్గంలోని పరిస్థితులు, గెలుపు అవకాశాలపై సిఎల్పీ నేత భట్టి, తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ, సీనియర్‌ నేత హనుమంతరావులతో ప్రత్యేకంగా చర్చించారు.ఈ నెల 18 నుంచి ప్రచారం ప్రారంభించనున్న నేపథ్యంలో పార్టీ సీనియర్లతో సమావేశం అయ్యారు పాల్వాయి స్రవంతి. అసంతృప్తి నేతలు అందర్నీ ఒక తాటిపైకి తెచ్చి క్యాడర్లో మరింత జోష్‌ తీసుకువచ్చి గెలుపు మార్గాలన్నీ వెతికే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. దీంతో మునుగోడులో పాలిటిక్స్‌హీట్‌ రోజు రోజుకు పెరిగిపోతుంది.

Tags

Read MoreRead Less
Next Story