Munugodu By Elections : మునుగోడు ఉపఎన్నికలు ఎప్పుడంటే..?

Munugodu By Elections : మరో మూడు నెలల్లోనే మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఇదే సంకేతాలు ఇస్తోంది. నవంబర్‌లో మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావొచ్చని రాజకీయ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి.
కోమటిరెడ్డి రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ కేవలం పావుగంటలోనే ఆమోదించడంతో.. టీఆర్‌ఎస్ సర్కార్ సైతం ఉప ఎన్నిక త్వరగా జరగాలనే కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే, ఎలాంటి తాత్సారం లేకుండా ఆమోదముద్ర వేశారనే చర్చ నడుస్తోంది.
దాదాపుగా వచ్చే నవంబర్‌లోనే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందన్న అంచనాలతో పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. అభ్యర్థుల ఎంపికపై అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్‌లో చర్చలు జరుగుతున్నాయి. బై పోల్ మూడునెలల్లోనే రాబోతుండడంతో అటు అభ్యర్ధి ఎంపికకు కసరత్తులు, ఇటు వ్యూహాలకు పదును పెడుతున్నాయి అధికార, ప్రతిపక్షాలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com