Munugodu: మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ షురూ..

Munugodu: మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల పక్రియ మొదలైంది..చండూరు ఎమ్మారో ఆఫీస్‌లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈనెల 10న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.11న కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు.. అయితే టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేశారు సీఎం కేసీఆర్. అయితే మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ ఘట్టం ప్రారంభం కాగానే ఏడుగురు అభ్యర్ధులు నామినేషన్ పత్రాలు తీసుకున్నారు.
అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. మునుగోడులో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన రోజే అధికారులు 13 లక్షల రూపాయలను పట్టుకున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలోకి అక్రమ మద్యం, డబ్బు నిరోధించేందుకు 14 పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే తనిఖీలో భాగంగా మునుగోడు మండలం గుడపురి పోలీస్ చెక్ పోస్టు వద్ద 13 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చండూరు మండలం బీమనపల్లి కీ చెందిన నరసింహ తన తన కారులో13 లక్షలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లో ప్లాట్ అమ్మగా వచ్చిన డబ్బును, పండగకు సొంత ఇంటికి వస్తూ తీసుకువచ్చానని… మళ్లీ ఆ డబ్బును హైదరాబాద్ కు తీసుకువెళుతున్ననని నరసింహరావు తెలిపాడు.
ఇక ఈ నెల14వ తేది వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు.15వ తేదిన నామినేషన్ల స్ర్కూట్నీ నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 17వ తేది వరకు గడువు విధించారు. ఇక నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా,6న ఫలితాలు వెలువడనున్నాయి.ఇక పోలింగ్ తేదీకి నెలరోజుల సమయం కూడా లేక పోవడంతో ప్రధాన పార్టీలన్నీ అక్కడే మోహరించనున్నాయి.
ఇప్పటికే అభ్యర్ధుల ప్రకటించాయి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు.. టీఆర్‌ఎస్ నేతలు. నియోజక వర్గాన్ని 86 క్లస్టర్‌లుగా విభజించి మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు . ఇక కాంగ్రెస్, బీజేపీ కూడా మండలానికి ఒక ఇంచార్జ్‌లను నియమించి ప్రచారంలో దూసుకుపోతున్నారు, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్ధి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డు ఇప్పటికే ఓ సారి నియోజక వర్గాన్ని చుట్టివచ్చారు.
మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. గత బైఎలెక్షన్‌తో పోలిస్తే.. ఈ బైపోల్ చాలా కాస్లీగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలోకి వచ్చిపోయే ప్రధాన రహదారులన్నింటిలోనూ 14 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. నల్గొండ నుంచి మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌లోకి ఎంటరయ్యే గుడాపూర్ గ్రామ సరిహద్దుల్లో తాజాగా 13 లక్షలు రూపాయాలు పట్టుబడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com