MLA Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక అంశాలు..

MLA Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యాయత్నం కేసులో కీలక అంశాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ప్రసాద్‌తో పాటు అతని స్నేహితులు, డీలర్ సంతులను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పోలీసుల విచారణలో.. నిందితుడు ప్రసాద్‌గౌడ్ 32 వేల రూపాయలకు మహారాష్ట్ర నాందేడ్‌లో తుపాకి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. అటు ఓ బొమ్మ తుపాకిని సైతం బేగం బజార్‌లో కొన్నట్లు తెలిపాడు. ఊర్లో తనను ఒంటరి చేసిన టీఆర్‌ఎస్ నేతల్ని బెదిరించడం కోసమే గన్ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు.
జీవన్‌రెడ్డి ఇంటికి తుపాకితోనే చేరుకున్న ప్రసాద్.. ఎమ్మెల్యేని కలవాలని చెప్పడంతో లోపలికి అనుమతిచ్చారు సెక్యూరిటీ సిబ్బంది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు ప్రసాద్.. ఈ టైంలో ఎందుకు వచ్చావని తిడుతూ జీవన్‌రెడ్డి.. ప్రసాద్‌ను బయటికి పంపాడు. ఈ సందర్భంగా.. వాగ్వాదానికి దిగిన ప్రసాద్ గౌడ్‌పై జీవన్‌రెడ్డి చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ప్రసాద్‌గౌడ్‌ను నెట్టివేశారు. అదే సమయంలో ప్రసాద్ దగ్గర తుపాకి గుర్తించారు జీవన్‌రెడ్డి. దీంతో సిబ్బందితో కలసి ప్రసాద్‌ను నిర్బంధించారు జీవన్‌రెడ్డి. ప్రసాద్‌గౌడ్ గతంలో మావోయిస్ట్ సానుభూతిపరుడిగా ఉన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com