పుష్య అమావాస్య నాడు అర్ధరాత్రి సమయంలో నాగోబాకి మహాపూజ

పుష్య అమావాస్య నాడు అర్ధరాత్రి సమయంలో నాగోబాకి మహాపూజ
పవిత్ర గంగా జలాలతో మెస్రం వంశీయులు అభిషేకం నిర్వహించారు.

ఆదివాసీల సంప్రదాయ పండగ నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్‌లోని కేస్లాపూర్‌లో ఏటా ఈ జాతర జరుగుతుంది. పుష్య అమావాస్య నాడు అర్ధరాత్రి సమయంలో నాగోబాకి మహాపూజ, హారతి ఇచ్చి జాతర ప్రారంభించారు. పవిత్ర గంగా జలాలతో మెస్రం వంశీయులు అభిషేకం నిర్వహించారు. నాగోబా జాతర ఈనెల 17వ తారీఖు వరకు జరుగుతుంది. కరోనా కారణంగా ఈసారి దర్బార్‌ను రద్దు చేశారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎస్పీ విష్ణు వారియర్ పాల్గొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story