Nalgonda: శ్రీరామ నవమి వేళ రికార్డింగ్ డ్యాన్సులు.. పోటా పోటీగా పార్టీలు

దేశ వ్యాప్తంగా రాములోరి కళ్యాణం, ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంటే..నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో మాత్రం శ్రీరామ నవమి సందర్భంగా రికార్డింగ్ డాన్సులతో మారుమోగింది. ఎన్నికల వేళ పొలిటికల్ పార్టీలు ఏ సందర్భాన్ని వదలడం లేదు. తిరుమలగిరి మండల కేంద్రంలోని రాజకీయ నాయకులు శ్రీరామ నవమి రోజు అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులు పోగ్రామ్ ను ఏర్పాటు చేయించారు.
భక్తి శ్రద్దలతో చేయించాల్సిన నవమి వేడుకలను అమ్మాయిలతో, డీజే సౌండ్స్ తో తిరుమలగిరి మారుమోగింది. వెనుక శ్రీరామ నవమి ప్లెక్సీలు ఏర్పాటు చేసి దాని ముందు స్టేజ్ ఏర్పాటు చేసి అబ్బాయిలు, అమ్మాయి కలిసి రికార్డింగ్ డాన్సులు చేశారు. ఎన్నికలు దెగ్గర పడుతుండంతో రాజకీయ పార్టీలు వారి వ్యూహాలను రచిస్తున్నారు. యువకులను ఆకర్షించడానికి ఏ పనైనా చేసేస్తున్నారు. ఒక్క తిరుమలగిరి మండల కేంద్రంలోనే పోటాపోటీ ఆరు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
అధికార బీఆర్‌ఎస్ పార్టీలోనే రెండు వర్గాలు ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య వర్గ విభేదాలు ఉడటంతో నువ్వా.. నేనా.. తగ్గేదేలే అనేట్లు వారి అనుచరులు ఆర్కెస్ట్రా పోగ్రామ్‌లు ఏర్పాటు చేశారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ వారు కూడా మేం ఏం తక్కువా..? అన్నట్లు వారు కూడా ఆర్కెస్ట్రా పోగ్రామ్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమలగిరి ప్రాంతమంతా డీజే సౌండ్లతో మారు మోగింది. దీంతో రాత్రి ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. పోలీసులు కూడా దీన్ని అడ్డుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com