Nalgonda: నల్గొండ రైతుల కష్టాలు.. ఓవైపు వర్షాలు.. మరోవైపు ఆంక్షలు..

Nalgonda farmers (tv5news.in)

Nalgonda farmers (tv5news.in)

Nalgonda: అకాల వర్షం అన్నదాతలను అష్టకష్టాలపాలు చేసింది.

Nalgonda: అకాల వర్షం అన్నదాతలను అష్టకష్టాలపాలు చేసింది. ఆటుపోట్లకు తట్టుకొని పండించిన పంటను ఐకేపీ సెంటర్లకు తరలించగా.. వర్షంపడి ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నల్గొండజిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షంతో తీవ్ర నష్టం జరిగిందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

ఓ పక్క అకాల వర్షాలు రైతుల్ని దారుణంగా దెబ్బతీస్తుంటే.. ఇటు పంటను అమ్ముకునే విషయంలోనూ ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిర్యాలగూడలో రైతులంతా ఇప్పుడు మార్కెట్‌ యార్డ్‌లో ధాన్యం విక్రయించేందుకు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం లోడ్‌లతో వస్తున్న ట్రాక్టర్లను చిల్లేపల్లి వంతెన వద్దే ఆపేయడంతో వారు ఆందోళనలో ఉన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి బ్రిడ్జి వద్దే 3 రోజులుగా 200కిపైగా ట్రాక్టర్లు నిలిచిపోయాయి.

మరోవైపు, రైస్ మిల్లుల వద్ద కూడా వందలాది ట్రాక్టర్లు ఆగిపోయాయి. ఓ పక్క వర్షం పడేలా వాతావరణం ప్రతికూలంగా కనిపిస్తుంటే.. ఇటు వరికోతలు ఆపాలని, టోకెన్ తీసుకున్న వారు మాత్రమే ధాన్యం లోడ్‌లు తీసుకుని రావాలని ఆంక్షలు పెడుతుంటే ఎలాగని అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు.

ఇటు టోకెన్‌ లేకపోతే ట్రాక్టర్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని చెప్తుండడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అటు అకాల వర్షం, ఇటు టోకెన్ల సిస్టంతో తాము నిండా మునుగుతున్నామని ఆవేదనతో ఉన్నారు. వరికోతల ప్రారంభ దశలోనే పరిస్థితి ఉలా ఉంటే.. వారం దాటితే పరిస్థితి ఇంకెలా ఉంటుందోననే ఆందోళన కూడా ఉంది. స్థానికంగా ఉన్న రైతుల ట్రాక్టర్లను ఆపేస్తున్న పోలీసులు.. పొరుగు నియోజకవర్గాల వాటిని అనుమతిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story