Nalgonda : నల్గొండ గురుకులాల్లో ఒకేసారి 44 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్..

X
Nalgonda : నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. నిన్న కొండమల్లేపల్లి గురుకుల పాఠశాలలో 29 విద్యార్థులకు కోవిడ్ బారిన పడ్డారు. విద్యార్థులందరినీ ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.
అటు నార్కట్‌పల్లి మహాత్మ జ్యోతిరావుపూలే సంక్షేమ గురుకుల కళాశాలలోనూ 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిని హోమ్ క్వారంటైన్‌లోనే చికిత్స అందిస్తున్నారు. డీఎంహెచ్ఓ కొండలరావు నార్కట్‌పల్లి గురుకుల కాలేజీని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాధితులందరికీ స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని డీఎంహెచ్ఓ అన్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
