తీవ్ర ఉత్కంఠగా నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ కౌంటింగ్‌..!

తీవ్ర ఉత్కంఠగా నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ కౌంటింగ్‌..!
X
టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్ధి తీన్మార్‌ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది.

నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ కౌంటింగ్‌ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది..టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్ధి తీన్మార్‌ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తీన్మార్‌ మల్లన్న మధ్యే ప్రధాన పోటీ ఉండటంతో.. ఎవరైనా స్వల్ప ఆధిక్యంతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మూడవ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు పల్లాకు లక్షా 32వేల 683 ఓట్లు.. తీన్మార్‌ మల్లన్నకు లక్షా 8వేల 104 ఓట్లు వచ్చాయి.

Tags

Next Story