టీఆర్ఎస్ లో ప్రకంపనలు.. కేటీఆర్ కు సొంత పార్టీ కౌన్సిలర్ లేఖ..!

టీఆర్ఎస్ లో ప్రకంపనలు.. కేటీఆర్ కు సొంత పార్టీ కౌన్సిలర్ లేఖ..!
మునిసిపల్ చైర్మన్ పీఠం ఇస్తానని తనను మోసం చేశారని ఓ వార్డ్ కౌన్సిలర్ మంత్రి కేటీఆర్ కు లెటర్ రాయడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

మునిసిపల్ చైర్మన్ పీఠం ఇస్తానని తనను మోసం చేశారని ఓ వార్డ్ కౌన్సిలర్ మంత్రి కేటీఆర్ కు లెటర్ రాయడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. చైర్మన్ పీఠం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎన్నికల సమయంలో మూడు కోట్లు ఖర్చు పెట్టానని నల్గొండ జిల్లా చండూరు ఒకటో వార్డు కౌన్సిలర్ కోడి వెంకన్న ఓ లెటర్ రాశాడు. దీనిని నేరుగా తన ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈనెల 18న పంపించాడు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డామని... కానీ సొంత పార్టీ నేతల నుంచే తనకు వేధింపులు ఎక్కువయ్యాయని లేఖలో పేర్కొన్నారు.

అయితే మున్సిపాలిటీ ఎన్నికల్లో కోడి వెంకన్న గెలుపొందగా ఆయన భార్య కోడి సుష్మ ఓడిపోయింది. అనంతరం రైతు సహకారం సంఘం ఎన్నికల్లో చండూరు ఒకటవ వార్డు నుంచి కోడి సుష్మ పోటీ చేసి గెలుపొందగా, ప్రస్తుతం రైతు సహకార సంఘం చైర్మన్ గా ఎన్నికై బాధ్యతలు నిర్వహిస్తోంది. మరోవైపు చండూరు ఒకటవ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసినందుకు తాను 39,930 రూపాయలు ..చండూరు మూడో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసినందుకు తన భార్య కోడి సుష్మ తరుపున 39,930 రూపాయలు ఖర్చు చేసినట్లు ఎలక్షన్ అధికారులకి చూపించమని లేఖలో పేర్కొన్నారు.

అయితే అప్పుడు అలా తప్పుడు లెక్కలు చూపించి ఇప్పుడు ఈ విధంగా మూడు కోట్లు ఖర్చు చేసినట్లు స్వయంగా కౌన్సిలర్ ప్రకటించడంతో ఎన్నికల సంఘం అతనిపై ఏ చర్యలు తీసుకుంటుందో అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ కి పంపించిన లేఖను చూసిన అనంతరం వీరిపై ఎన్నికల అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలచినట్లు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో ఖర్చు చేసినందుకు కోడి వెంకన్న పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story