Nallakunta: పాడుబడ్డ రోడ్డు... పట్టించుకోని అధికారులు... స్థానికుల అగచాట్లు...

Nallakunta: పాడుబడ్డ రోడ్డు... పట్టించుకోని అధికారులు... స్థానికుల అగచాట్లు...
పాత నల్లకుంట మార్గంలో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులు; మూసీ; ఏడాదిగా నడుస్తోన్న మూసీ డివిజన్ పనులు; కొన్ని నెలలుగా నిలిచిపోయిన పనులు; తీవ్ర ఇబ్బందులు ఎరుక్కొంటోన్న వాహనదారులు; ఊహించని ప్రమాదాలు

పాత నల్లకుంటలో స్థానికుల ఇక్కట్లు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రోడ్డు విస్తరణ పనులు మధ్యలోనే నిలిచిపోవడం సగం తవ్విన రోడ్లతో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతంగా మారాయి. ఏడాది కాలంగా మూసి డివిజన్ పనులు నడుస్తుండగా, కొన్ని నెలల క్రితం అకస్మాత్తుగా పనులన్ని నిలిచిపోయాయి. రోడ్లను పూర్తిగా తవ్వేయడంతో దుమ్ముధూళి వాహనదారుల కళ్లలో పడి తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. డస్ట్ ఎలర్జీ వల్ల గొంతునొప్పి, చర్మవ్యాధులు వంటి ఆరోగ్య సమస్య తలెత్తుతున్నాయి. ఇక సగం తవ్వి వదిలేసిన గుంతల్లో పడి ఎంతో మంది గాయాలపాలవుతున్నారు. ఇక వాయుకాలుష్యంతో పాటూ భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయనిత స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతల్లో చెత్తా చెదారం చేరి దోమలకు ఆలవాలంగా మారుతుండటంతో ఇరుగు పొరుగు ఇళ్లల్లోని ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story