Raja Singh: రాజాసింగ్‌ను వెంటనే విడుదల చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశం..

Raja Singh: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను వెంటనే విడుదల చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. పోలీసుల రిమాండ్ ను న్యాయస్థానం రిజెక్ట్ చేసింది.. రాజాసింగ్ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు.. ఈ పిటిషన్ పై హోరాహోరీగా వాదనలు నడిచాయి.. దాదాపు 45 నిమిషాలపాటు వాదనలు జరిగాయి..
రాజాసింగ్ అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్లను పోలీసులు పాటించలేదని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం అక్రమమని చెప్పారు.. రాజాసింగ్ లాయర్ వాదనలతో కోర్టు ఏకీభవించింది.. అరెస్టు విధానం సక్రమంగా లేదని కోర్టు అభిప్రాయపడింది.. రిమాండ్ ను రిజెక్ట్ చేసింది.. వెంటనే రాజాసింగ్ ను విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది.. అయితే పోలీసు విచారణకు సహకరించాలని, ఉద్దేశపూర్వక వ్యాఖ్యలేవీ చేయొద్దని రాజాసింగ్ కు కోర్టు సూచించింది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com