Narendra Modi: మే 26న హైదరాబాద్‌కు మోదీ.. ఆ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా..

Narendra Modi: మే 26న హైదరాబాద్‌కు మోదీ.. ఆ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా..
X
Narendra Modi: ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కి రానున్నారు ప్రధాని మోదీ.

Narendra Modi: ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కి రానున్నారు ప్రధాని మోదీ. ఐఎస్‌బీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. జరిగే వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. తొలిసారి ఐఎస్‌బీ మొహాలితో కలిసి ఐఎస్‌బీ హైదరాబాద్‌ సంయుక్త గ్రాడ్యూయేషన్‌ సెరిమనీ ఏర్పాటు చేసింది. 2022 పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రాంని 900 మంది విద్యార్ధులు కంప్లీట్‌ చేశారు.ఇందులో గోల్డ్‌ మెడల్‌ సాధించిన 8 మందికి సర్టిఫికెట్‌లను అందించనున్నారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందించామన్నారు ఐఎస్‌బీ డీన్‌. అయితే బిజీ షెడ్యూల్‌ వల్ల సీఎం కేసీఆర్‌ రాలేకపోతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ స్థానంలో.. సీనియర్‌ మంత్రి హాజరవుతారని తెలిపారు

Tags

Next Story