DRUGS: నార్సింగి డ్రగ్స్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. ఇందులో 20 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు వీరిలో ఏడుగురు పెడ్లర్లు, 13 మంది వినియోగదారులున్నారని తెలిపారు. కేసులో ఏ10గా ప్రముఖ సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్‌ను పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టు ప్రకారం డ్రగ్స్ నైజీరియా నుంచి ఢిల్లీ, హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాలకు చేరుతోంది. ఎబుకా, ఆనౌహ బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతమ్, వరుణ్ ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని పోలీసులు తెలిపారు. వరుణ్, గౌతమ్, షరీఫ్ తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని... పెడ్లర్లకు కావాల్సిన డబ్బును సమకూరుస్తూ నైజీరియన్లు ఆర్థికంగా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో నైజీరియాకు చెందిన ఎబుకా సుజి కింగ్‌పిన్‌గా ఉన్నట్లు గుర్తించారు. ఎబుకా నుంచి ఆనౌహ బ్లెస్సింగ్ అనే మహిళ ద్వారా డ్రగ్స్ సరఫరా సాగుతోంది. ఇప్పటివరకు 20 సార్లు ఆనౌహ బ్లెస్సింగ్ మాదకద్రవ్యాలు తీసుకొచ్చారు. గౌతమ్ అనే పెడ్లర్ ద్వారా హైదరాబాద్, రాజమహేంద్రవరం, ప్రకాశం జిల్లాకు ఇవి చేరుతున్నాయి. ఇందుకుగాను అతడికి నైజీరియన్ 9 నెలల్లో రూ.10 లక్షల కమిషన్ ఇచ్చాడు. బండ్లగూడలోని లుంబినీ కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బు చెల్లింపులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.ఎబుకా నుండి బ్లెస్సింగ్ అనే మరో నైజీరియన్ ద్వారా ఇండియాలోని రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 సార్లు హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లై చేసినట్టు బ్లెస్సింగ్ అంగీకరించాడు. గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాకు డ్రగ్స్ చేరుతున్నాయి.
9 నెలల్లో 10 లక్షల రూపాయలను కమిషన్ రూపంలో డ్రగ్ పేడ్లర్ గౌతంకు నైజీరియన్ ముట్టచెప్పాడు. బండ్లగూడలో ఉన్న లుంబిని కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బులు చెల్లించారు. వరుణ్ నుండి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. తన స్నేహితురాలి పేరును తన పేరుగా బ్లెస్సింగ్ మార్చుకుంది. తండ్రి బస్సు డ్రైవర్ కావడంతో ఆర్థిక సమస్యలు కారణంగా ఇంటర్ వరకు చదువుకున్నాడు. 2017లో ఫేస్ బుక్‌లో బ్లెస్సింగ్ అనే మహిళతో పరిచయం అయ్యింది. బెంగుళూరు వచ్చి బ్లెస్సింగ్ అనే స్నేహితురాలి బట్టల దుకాణంలో ఒనుహా పని చేశాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com