Naveen Murder: నోరు విప్పిన హరిహర.. ఆరోజే చంపాలనుకున్న

అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు హరిహర కృష్ణకు పోలీస్ కస్టడీ ముగియడంతో.. కోర్టులో హజరుపర్చి జైలుకు తరలించారు. నవీన్ హత్యోదంతంపై పోలీస్ కస్టడీలో హరిహర కృష్ణ నోరు విప్పాడు. నవీన్‌ను ఎందుకు చంపాల్సి వచ్చిందనేది వివరించాడు. ఇంటర్‌లో నవీన్ పరిచయమయ్యాడని.. నవీన్, నిహారిక ప్రేమించుకుని అక్కడక్కడ తిరిగేవారని చెప్పాడు. ఇద్దరు ఆ విషయాల్నీ తనకు చెప్పేవారన్నాడు. ఐతే.. నవీన్-నిహారిక మధ్య గొడవ వచ్చి విడిపోయారని.. ఆ తర్వాత తాను నిహారికతో చనువుగా ఉండేవాడినని వివరించాడు. నిహారిక తన ప్రేమను కూడా అంగీకరించిందని చెప్పాడు.
ఐతే.. ఆ తర్వాత నవీన్ కాల్స్, మెసేజ్‌లతో నిహారికను ఇబ్బంది పెట్టేవాడని దీంతో.. నవీన్‌ను చంపాలని 3 నెలల కిందట డిసైడ్ అయ్యానని హరిహర చెప్పాడు. రెండు నెలల కింద మలక్ పేట డీ మార్ట్‌లో 200 రూపాయలకు కత్తి కొని ఇంట్లో దాచానని మర్డర్ టైంలో నా ఫింగర్ ప్రింట్స్ పడకుండా మెడికల్ షాప్‌లో రెండు జతల గ్లౌజ్‌లు కొన్నానని చెప్పాడు.
జనవరి 16న ఇంటర్ ఫ్రెండ్స్ కలుసుకున్నాం.. అదే రోజు హత్య చేయాలనుకున్నా.. కానీ కుదరలేదని చెప్పాడు హరిహర, ఫిబ్రవరి 17న హైదరాబాద్ వచ్చిన నవీన్‌ను.. ఎల్‌బీ నగర్‌లో పికప్ చేసుకున్నట్లు తెలిపాడు.. నవీన్ ను చంపటానికి ఇదే మంచి ఛాన్స్ అనుకున్నానన్న హరిహర.. ఎవరు లేని ప్రాంతానికి తీసుకెళ్లి నిహారికను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని ప్రశ్నించినట్లు చెప్పాడు.. నవీన్ తనను కొట్టడంతో.. గొంతు నులిమి చంపేశానని. ఆ తర్వాత కత్తితో పొడిచి..గుండెను శరీరం నుంచి తీశానని.. మర్మాంగాన్ని కోసేసినట్లు చెప్పాడు. ఆ తర్వాత శవాన్ని ఎవరికీ కనబడకుండా చెట్లపొదల్లో పడేసి, నవీన్ శరీర భాగాలను రాజీవ్ గృహకల్ప వెనకాల చెట్లపొదల్లో పడేసినట్లు హరిహర పోలీస్‌లకు వివరించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com