Aasara pensions : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. మూడు రోజుల్లో కొత్త పెన్షన్లు..!

ఆసరా పింఛన్లు పొందటానికి కనీస వయస్సు 65 సంవత్సాలు నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అర్హత కలిగిన లబ్దిదారుల జాబితా వెంటనే తయారు చేసి , పెన్షన్లు మంజూరు చేసి లబ్దిదారులకు అందించనున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన అభ్యర్థులకు పెన్షన్లు అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ కనీస వయసును తగ్గించారన్నారు. అర్హులైన వారికి మూడు రోజుల లోగా పెన్షన్లు మంజూరు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎంపికలో ఎలాంటి అవకతవకలకు తావుండకూడదన్నారు.అర్హులైన అభ్యర్థులకు పెన్షన్లు అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ కనీస వయసును తగ్గించారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com