TS Corona Cases: కొత్తగా 339 కరోనా కేసులు

X
తెలంగాణలో కొత్తగా 339 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 80,568 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,56,794కు చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,867కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 417 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,46,761కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,166 యాక్టివ్ కేసులున్నట్లు ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
