తెలంగాణలో కొత్తగా 645 కరోనా కేసులు..

X
Telangana: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో 1,23,166 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 645 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,42,436కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 729 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,29,408కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో నలుగురు బాధితులు కరోనా బారినపడి ప్రాణాలు కొల్పోయారుు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,791కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,237 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
