ఎన్ని సార్లు చెప్పినా హెల్మెట్ పెట్టుకోవట్లేదని..

ఎన్ని సార్లు చెప్పినా హెల్మెట్ పెట్టుకోవట్లేదని..
ఆఖరి అస్త్రం ప్రయోగించారు.. హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకు వచ్చారంటే..

చెప్పీ చెప్పీ విసిగిపోయారు.. ఇక ఆఖరి అస్త్రం ప్రయోగించారు.. హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకు వచ్చారంటే మీ లైసెన్స్ కట్ అంటున్నారు భాగ్యనగర పోలీసులు. ప్రాణాలు పోతాయని చెవిలో పోరు పెట్టినా వినట్లేదు. దీంతో విసుగు చెందిన పోలీసులు మొదటిసారి మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. అదే రెండోసారి అయితే జీవితకాలం లైసెన్స్ రద్దు చేస్తారు. అయితే దీనిని ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. ఇందుకు సంబంధించి చట్టం కూడా తీసుకువచ్చింది.

మోటార్ వెహికల్ చట్టం 206లో సవరణలు చేసి అమల్లోకి తీసుకొచ్చింది. దీనిని సైబరాబాద్ పోలీసులు అమలు పరుస్తున్నట్లు ట్రాఫిక్ డిసిపి విజయ్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే కర్ణాటకలో ఈ రూల్‌ని అమలు చేస్తున్నారని విజయ్ కుమార్ తెలిపారు. డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, ట్రిబుల్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, రాంగ్ సైడ్ డ్రైవిండ్ చేయడం, సిగ్నల్ జంపింగ్ చేయడం, ఇలా మొత్తం ఎనిమిది కేటగిరీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. ఈ ఎనిమిది కేటగిరిల్లో డ్రైవింగ్ చేస్తున్న వారి వల్ల చాలా వరకు ప్రాణాలు పోతున్నాయని కాబట్టి వీటికి కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tags

Next Story