కొత్త టౌన్‌షిప్‌లు.. అన్ని వర్గాలకు అందుబాటులో..

టౌన్‌షిప్ పాలసీ రెండు దశాబ్ధాల క్రితమై ప్రారంభమైనప్పటికీ ఈ మధ్య రియల్టర్లు వాటికి కాస్త దూరంగా ఉన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం టౌన్‌షిప్ పాలసీ తీసుకురావడంతో పలువురు స్థిరాస్థి వ్యాపారులు మళ్లీ వీటిపై దృష్టి పెట్టారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఈ తరహా ప్రాజెక్టులు వస్తున్నాయి. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ పాటికే బుకింగ్‌లు ప్రారంభించగా.. మరికొన్ని ప్రాజెక్టులు కొంత వరకు విక్రయాలు పూర్తి చేశాయి. ప్రస్తుతం ఐటీ రంగం ఔటర్ పరిధి దాటి విస్తరిస్తోంది.
దీంతో మరి కొన్ని సంస్థలు.. విద్యాలయాలు, వినోద కేంద్రాలు ఇక్కడి నుంచి తమ కార్యకలాపాలను విస్తరించే పనిలో పడ్డాయి. ఇవి పెద్ద ఎత్తున ఉపాధి ఆవాసాలుగా మారనున్నాయి. దీంతో వీటిల్లో పని చేసే ఉద్యోగస్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు నివాసయోగ్యాలు నెలకొల్పనున్నాయి రియల్ సంస్థలు. నగరంలో నివసిస్తూ పని చేసే కార్యాలయానికి వెళ్లాలంటే ఎంత లేదన్నా 30 నుంచి 50 కి.మీ దూరం ఉంటుంది. అందుకే పని చేసే సంస్థల చుట్టూనే టౌన్‌షిప్‌లు నిర్మిస్తే వెసులు బాటుగా ఉంటుందని రహదారి చుట్టుకపక్కల నిర్మాణాలు చేపడుతున్నారు.
ఇప్పటి వరకు ఐదు ఎకరాల నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్‌మెంట్లు లేదా విల్లాలు నిర్మించే వారు. కానీ ఇప్పుడు వేర్వేరు ఆదాయ వర్గాలను దృష్టిలో పెట్టుకుని టౌన్‌షిప్పులను రూపకల్పన చేస్తున్నారు. ఇందులో కొంత విస్తీర్ణంలో స్థలాలు, మరి కొంత స్థలంలో అపార్ట్‌మెంట్లు, విల్లాలు కడుతున్నారు. 200ల గజాల స్థలం అయితే రూ. 20 లక్షలు, అపార్ట్‌మెంట్ రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు వీటిల్లో విక్రయాలు జరుగుతున్నాయి. 50 ఎకరాల నుంచి రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ టౌన్‌షిప్పులు నిర్మితమవుతున్నాయి.
శంషాబాద్ విమానాశ్రయం పరిధిలోనూ, యాచారం, చౌటుప్పల్, శ్రీశైలం రహదారి, కడ్తాల్ సమీపంలో చాలా వరకు భూసేకరణ పూర్తయింది. నగరానికి దూరంగా టౌన్‌షిప్పులు వస్తున్నా రవాణా సౌకర్యాలు మెరుగవడంతో స్థిరాస్థి వ్యాపారంగా అనుకూలంగా మారయి అవుట్‌స్కట్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com