Hyderabad: నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.. బ్రేక్ చేస్తే జేబులు ఖాళీ..

Hyderabad: నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.. బ్రేక్ చేస్తే జేబులు ఖాళీ..
Hyderabad: ఇన్నాళ్లు చూసిచూడనట్లు వదిలేసిన ట్రాఫిక్ పోలీసులు.. ఇక అసలు ప్రతాపం చూపిస్తామంటున్నారు. గీత దాటితే వాత తప్పదంటున్నారు.

Hyderabad: ఇన్నాళ్లు చూసిచూడనట్లు వదిలేసిన ట్రాఫిక్ పోలీసులు.. ఇక అసలు ప్రతాపం చూపిస్తామంటున్నారు. గీత దాటితే వాత తప్పదంటున్నారు. సద్దులబతుకమ్మ వేళ ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ వాసులకు కీలక ప్రకటన చేశారు.

నేటి నుంచి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వస్తాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. ఇకపై వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే, బాదుడు తప్పదని హెచ్చరించారు.

ఇప్పటిదాకా లైసెన్స్ లేకున్నా, హెల్మెట్ లేకున్నా, కారులో సీటు బెల్ట్ పెట్టుకోకున్నా, మితి మీరిన వేగంతో దూసుకెళ్లినా, నో పార్కింగ్ జోన్‌లో వాహ‌నాలు నిలిపినా... జ‌రిమానాలు విధించిన ట్రాఫిక్ పోలీసులు ఇక‌పై స‌రికొత్త నిబంధ‌న‌లు అమ‌లులోకి తీసుకురానున్నారు.

స్టాప్ లైన్ దాటితే వందరూపాయలు, ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తే వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు. ఇక పాద‌చారుల‌కు అడ్డంగా వాహ‌నాలు నిలిపే వారికి రూ.600 జ‌రిమానా విధించ‌నున్నారు.

నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆపరేషన్ రోప్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. పార్కింగ్‌కు ఉపయోగించే సెల్లార్లలో, లేదా ఫుట్‌పాత్‌లపై వ్యాపారం నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని జాయింట్ సీపీ హెచ్చరించారు. వ్యాపారులతో త్వరలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని సీపీ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story