గాంధీ ఆస్పత్రి అత్యాచారం కేసులో మరో ట్విస్ట్ ..మెడికల్ రిపోర్టులో..

Gandhi Hospitial: గాంధీలో అసుపత్రి అత్యాచార కేసులో కొత్త ట్విస్టులు కనబడుతున్నాయి. అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరగడానికి అవకాశమే లేదంటున్న వాదనలకు.. ఆధారాలు కూడా దొరకుతున్నాయి. రేప్ జరిగిందని చెప్పిన మహిళ రక్తం, ఇతర నమూనాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ బృందం.. బాధితురాలికి అసలు మత్తు మందే ఇవ్వలేదని తేల్చింది. కర్చీఫ్‌కు మత్తుమందు రాసి ముక్కు మూశారంటూ బాధిత మహిళ ఆరోపించింది. అయితే, క్లోరోఫామ్, ఇతర మత్తు పదార్థాల ఆనవాళ్లు లేవంటూ రిపోర్ట్ ఇచ్చింది ఫోరెన్సిక్ బృందం.
ఇక బాధిత మహిళ సోదరి తిరుపతమ్మ దొరికితే తప్ప క్లారిటీ రాదంటున్నారు పోలీసులు. అందుకే, తిరుపతమ్మ తిరిగిన చోట సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీశారు పోలీసులు. ఈనెల 11న ముషీరాబాద్ వైపు వెళ్లినట్టు సీసీటీవీలో రికార్డ్ అయింది. ఒంటిపై దుస్తులు సరిగా లేని స్థితిలో, నీరసంగా ఉన్నట్లు సీసీటీవీలో కనిపించింది. అయితే, కల్లు తాగిన కారణంగా మత్తులో ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుపతమ్మ జాడ కోసం.. అన్ని పోలీస్‌స్టేషన్లకు ఫొటో పంపిచారు. లుక్‌ఔట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 60 మంది సాక్షులను విచారించిన పోలీసులు.. అదుపులో ఉన్న గాంధీ ఉద్యోగులను మరోసారి ప్రశ్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com