తెలుగు రాష్ట్రాల్లో కనిపించని న్యూ ఇయర్‌ జోష్‌!

తెలుగు రాష్ట్రాల్లో కనిపించని న్యూ ఇయర్‌ జోష్‌!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో న్యూ ఇయర్‌ 2021 జోష్‌ కనిపించలేదు. కరోనా ఆంక్షల నేపథ్యంలో వేడుకలు లేక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాలు వెలవెలబోయాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో న్యూ ఇయర్‌ 2021 జోష్‌ కనిపించలేదు. కరోనా ఆంక్షల నేపథ్యంలో వేడుకలు లేక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాలు వెలవెలబోయాయి. హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ ప్రాంతమంతా నిర్మానుష్యమైంది. గత ఏడాది న్యూఇయర్‌ జోష్‌ కనిపిస్తే ఇప్పుడు చాలా నార్మల్‌ సిచ్యయేషన్‌ కనిపించింది.

విశాఖ బీచ్‌ రోడ్డులోనూ అదే పరిస్థితి. నిబంధనలు కఠినంగా అమలు చేశారు పోలీసులు. దీంతో బీచ్‌ రోడ్డు మొత్తం వెలవెలబోయి కనిపించింది. పోలీస్‌ పెట్రోలింగ్‌తో జనం బయటికే రాలేదు. ఇక బెజవాడ వాసులు కొత్త సంవత్సర వేడుకలను వైవిధ్యంగా నిర్వహించారు. అపార్ట్‌మెంట్లలో వేడుకలు జరిపారు. బందరు రోడ్డు నిర్మానుష్యంగా మారింది. రోడ్లపై పోలీసులు భారీగా మోహరించారు. దీంతో బందరు రోడ్డు వెలవెలబోయింది. ఈసారి న్యూ ఇయర్‌ సంబురాలు కళ తప్పాయి.

కరోనా నేపథ్యంలో తిరుపతిలో నూతన సంవత్సర వేడుకలు చాలా నిరాడంబరంగా జరుపుకున్నారు ప్రజలు. ప్రధాన కూడళ్లలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని పోలీసులు చెప్పడంతో ఇళ్లకే పరిమితమయ్యారు.

న్యూ ఇయర్‌ వేడుకల్లో మందుబాబులు హల్‌చల్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌ వద్ద ఏర్పాటు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పెద్ద ఎత్తున యువత పట్టుబడ్డారు. ఫ్యామిలీతో వెళ్తున్న వారు, బ్యాచిలర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ చిక్కారు. నగర వ్యాప్తంగా వంద చోట్ల స్పెషల్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేపట్టారు పోలీసులు.

Tags

Next Story