Miss India 2020 : మిస్ ఇండియా 2020 విజేతగా నిలిచిన తెలుగమ్మాయి

X
Miss India 2020 : మిస్ ఇండియా 2020 విజేతగా నిలిచింది తెలుగమ్మాయి మానస వారణాసి. VLCC ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీలు గ్రాండ్‌గా జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల మానస వారణాసి టైటిల్ గెలుచుకుంది. ఇక ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్ రన్నరప్. మిస్ గ్రాండ్ ఇండియా 2020గా హర్యానాకుచెందిన మానికా షియోఖండ్ నిలిచారు.
విజేతగా నిలిచిన మానస వారణాసి.. ఈ ఏడాది జరగనున్న 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొననుంది.
టైటిల్ గెలుచుకున్న మానసకు.. మిస్ ఇండియా 2019 విజేత సుమన్ రావు కిరీటాన్ని అందించారు.
ఈ పోటీలకు బాలీవుడ్ స్టార్లు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పుల్కిత్ సామ్రాట్, ప్రముఖ డిజైనర్లు ఫాల్గుని, షేన్ పికాక్ జడ్జీలుగా వ్యవహరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
