తెలంగాణలో మే 08 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు..!

తెలంగాణలో మే 08 వరకు  నైట్ కర్ఫ్యూ పొడిగింపు..!
కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో వారం పాటు నైట్ కర్ఫ్యూ పొడిగించింది. మే 08 వరకు కర్ఫ్యూను పొడిగించింది

తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూ మరో వారం రోజులు పొడిగించి ప్రభుత్వం. మే 8వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో యథాతథంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ కొనసాగనుంది. అంతకముందు కరోనా కట్టడి చర్యలపై తెలంగాణ హైకోర్టు విచారించింది. నేటితో నైట్‌ కర్ఫ్యూ ముగియనుండటంతో తదుపరి చర్యలు ఏంటో 45 నిమిషాల్లోగా చెప్పాలని ఆదేశించింది. లేదంటే ఆర్డర్‌ ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో నైట్‌ కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story