TG: గుట్టల్లా నోట్ల కట్టలు.. భారీ అవినీతి తిమింగలం

TG: గుట్టల్లా నోట్ల కట్టలు.. భారీ అవినీతి తిమింగలం
X
ఏసీబీ వలలో నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసర్ దాసరి నరేందర్‌... కోట్ల రూపాయలు, బ బంగారం సీజ్‌

ఏసీబీ చేతికి మ‌రో అవినీతి తిమింగ‌ళం చిక్కింది. ఆ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడటంతో అధికారులు అవాక్కయ్యారు. దాసరి నరేందర్ నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో సూపరింటెండెంట్ గా పని చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సమాచారం రావటంతో ఏసీబీ అధికారులు అత‌ని ఇంట్లో తనిఖీలు చేపట్టారు. 9వ తేదీ శుక్రవారం ఉద‌యం నుంచి సోదాలు చేప‌ట్టిన అధికారులు.. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా రూ.6.7 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. మరోవైపు.. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. అంత మొత్తం డబ్బును లెక్కించేందుకు ప్రత్యేకంగా నోట్ల లెక్కింపు యంత్రాల్ని తీసుకొచ్చారు. అలాగే.. బంగారు ఆభరణాలు, ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు చేపట్టారు. మొత్తంగా ఏసీబీ సోదాల్లో రూ. 2,93,81,000 నగదు పట్టుబడగా.. నరేందర్ భార్య, తల్లి బ్యాంకు ఖాతాల్లో రూ. కోటి 10 లక్షలను ఉన్నట్లు గుర్తించారు. అలాగే 51 తులాల బంగారు ఆభరణాలు, కోటి 98 లక్షలు విలువ చేసే ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఆదాయం మించిన ఆస్తుల కేసులో నరేందర్‌పై కేసు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుంది. నరేందర్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు. నరేందర్‌పై గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.

నరేందర్ బ్యాంక్ ఖాతాలో కోటి 10 లక్షల రూపాయలు కూడా గుర్తించారు. ఇంట్లోని బీరువాలో అర కిలో బంగారం, స్థిరాస్తులకు సంబంధించి 17 డాక్యుమెంట్లు క‌నుగొన్నారు. ఇప్పటి వరకూ జరిగిన సోదాల్లో దాసరి నరేందర్ నుంచి సీజ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ‌ రూ.6.07 కోట్లుగా అధికారులు వెల్ల‌డించారు.

ఏసీబీ సోదాల్లో నరేందర్ ఇంట్లో రూ.2.93 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. అలాగే నరేందర్, అతని భార్య, అతని తల్లి బ్యాంకు ఖాతాలోనూ భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. అలాగే 51 తులాల బంగారంతో పాటు రూ.1.98 కోట్ల విలువ చేసే స్థిరాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ సోదాల్లో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.6.07 కోట్లు ఉంటుందని తెలుస్తున్నది. నరేందర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. త్వరలో కోర్టులో హాజరు పర్చనున్నారు. అదనపు ఆస్తులను వెలికితీసేందుకు మరిన్ని సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. నరేందర్ అక్రమాస్తుల చిట్టాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags

Next Story