CRIME: బిడ్డ పుట్టే ముందు.. మృగంగా మారిన నాన్న

CRIME: బిడ్డ పుట్టే ముందు.. మృగంగా మారిన నాన్న
X

పుట్టబోయే బిడ్డ కోసం చీరకట్టుకుని ఎదురు చూస్తోంది. ఇంట్లో అరిష్టాలని, కర్పూరాలు పెట్టి దేవుడిని ప్రార్థించింది. మరో 24 గంటల్లో పసిపాప చేతిలోకి వస్తుందన్న ఆనందంతో మురిసిపోయింది. కానీ ఆమె కలలు చెదిరిపోయాయి. గర్భిణిగా ఉన్న ఆమెను భర్తే గొంతు నులిమి చంపేశాడు.

ఎంత దారుణం

ఈ విషాద ఘటన విశాఖపట్నంలోని పీఎం పాలెం ఉడా కాలనీలో జరిగింది. 24 గంటలలో డెలివరీ కావాల్సిన అనూషను ఆమె భర్త జ్ఞానేశ్వర్ దారుణంగా హత్య చేశాడు. రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట, మొదట ఎంతో అన్యోన్యంగా జీవించారు. కానీ కొంతకాలంగా వారి మధ్య మనస్పర్థలు పెరిగాయి. తరచూ గొడవలు పడేవారు. జ్ఞానేశ్వర్, సాగర్‌నగర్ వ్యూపాయింట్‌ దగ్గర స్కౌట్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తుంటాడు. ఉదయం అనూష ఆరోగ్యం బాగోలేదంటూ స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. కానీ అప్పటికే ఆమెను గొంతు నులిమి చంపేశాడు. తీరా ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి.. వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందిందని ధృవీకరించారు. అనూష మృతదేహాన్ని కేజీహెచ్ మాచురీకి తరలించారు. అనంతరం జ్ఞానేశ్వర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్యను తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. పీఎం పాలెం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అతనికి మరో యువతితో సంబంధం ఉందనే ఆరోపణలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ పేరుతో ఒక అమ్మాయి జీవితాన్ని, గర్భంలో ఉన్న పసిబిడ్డను కూడా బలిగొన్న ఈ దారుణం మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది.

Tags

Next Story