8వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్.. అప్లైకి ఆఖరు..

8వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్.. అప్లైకి ఆఖరు..
X
ప్రస్తుతం 8వ తరగతి చదివే విద్యార్ధులు దీనికి అర్హులని..

ప్రభుత్వ పాఠశాలలో చదివే 8వ తరగతి విద్యార్ధులకు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ స్కీం (ఎన్ఎంఎంఎస్ఎస్) కింద ఉపకార వేతనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న 8వ తరగతి విద్యార్థులు నవంబరు 20వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ. సత్యన్నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

రెసిడెన్షియల్ వసతి లేని అన్ని రకాల సాధారణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 8వ తరగతి చదివే విద్యార్ధులు దీనికి అర్హులని తెలిపారు. అలాగే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1,50,000 లోపు ఉండాలి. జనరల్, బీసీ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి రూ.50 ఉంటుంది. పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఏడాదికి రూ.12 వేల చొప్పున 9,10వ తరగతితో పాటు ఇంటర్‌లో రెండేళ్లు కలిపి మొత్తం నాలుగు సంవత్సరాల పాటు ఉపకార వేతనం అందుతుంది. పూర్తి వివరాలకు https://www.bsc.telanagaa.gov.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.

Tags

Next Story