Airport works : కదలని విమానాశ్రయ పనులు

Airport  works : కదలని విమానాశ్రయ పనులు
X
దశాబ్దంన్నర క్రితమే ఎయిర్‌పోర్టుకు శ్రీకారం చుట్టినా

నిజామాబాద్‌లో విమానాశ్రయ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. దశాబ్దంన్నర క్రితమే ఎయిర్‌పోర్టుకు శ్రీకారం చుట్టినా... పనులు మాత్రం నత్త నడకలా సాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి YS హాయంలో చేసిన ఆలోచన ఇప్పటికీ... సర్వేలు, పరిశీలినలకే పరిమితమవుతుంది తప్ప.. కార్యరూపం దాల్చలేదు. ఏళ్లకేళ్లు కాలయాపన నెలకొనడంతో భూములిచ్చిన రైతుల్లో సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

నిజామాబాద్‌ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ఊరిస్తోంది. ఏళ్లుగా ఎయిర్‌పోర్టు వస్తుందని జిల్లా వాసులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. దశాబ్ధంన్నర నుంచి అదిగో ఇదిగో అంటూ ప్రచారమే తప్ప పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. సర్వే జరిగినప్పుడు, బృందాలు పరిశీలనకు వచ్చినప్పుడల్లా జిల్లా వాసుల్లో ఆశలు పెరగడం.. మళ్లీ పురోగతి లేక నిరాశ చెందడం షరామామూలే అవుతోంది. వరంగల్‌ ఎయిర్‌పోర్టులో కదలిక వచ్చిన నేపథ్యంలో ఇందూరు ఎయిర్‌పోర్టుపై జిల్లా వాసుల్లో మళ్లీ ఆశలు కలుగుతున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి YS రాజశేఖర్‌రెడ్డి హయంలో నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పాటు గురించి ఆలోచన జరిగింది. 2013లో ఉడాన్ కింద కేంద్రం విమానాశ్రయ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా.. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. మొదట జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు కోసం 2 వేల ఎకరాలు అవసరం అవుతుందని భావించారు. ఆ తర్వాత ఉడాన్ కింద డొమెస్టిక్ ఎయిర్ పోర్టు మాత్రమే నిర్మించేందుకు మొగ్గు చూపారు. దీంతో 1600 ఎకరాల భూమి అవసరం అవుతుందని భావించారు. ఇందులో కోలిప్యాక్, తొర్లికొండ, మనోహరాబాద్, అర్గుల్.. ఈ ఐదు గ్రామాల శివారులో ఎయిర్ పోర్టు ప్రతిపాదిత స్థలం ఉంది. ఈ 1600 ఎకరాల్లో 1300 ఎకరాలు అసైన్ట్ భూములు ఉండగా.. 300 ఎకరాలు పట్టా భూములు ఉన్నాయి. అయితే ఏళ్లకేళ్లు కాలయాపన జరుగుతుండటంతో వస్తుందో లేదోనన్న అనుమానంతో క్రమంగా రైతుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

44వ జాతీయ రహదారికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్ పోర్టు ప్రతిపాదిత స్థలం ఉంది. నిజామాబాద్ చుట్టూ ఉన్న కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు సమీపంగా ఉంటుంది. దీంతో గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి ఎయిర్ పోర్టు వస్తే ప్రయాణం సులువు అవుతుంది. అలాగే హైదరాబాద్‌కు కేవలం 170కిలో మీటర్ల దూరంలోనే ఉంది. విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరితగా పూర్తి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Tags

Next Story