TS: బీసీ కుల గణనవై అనుమానాలు వద్దు

TS: బీసీ కుల గణనవై అనుమానాలు వద్దు
ఫిబ్రవరి 16 చరిత్రలో నిలిచిపోతుందన్న పొన్నం... ప్రజలను మభ్యపెట్టేందుకే అన్న కవిత

బీసీ కులగణనపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు తీర్మానానికి మద్దతిచ్చాయనిచెప్పారు తీర్మానాన్ని ఆమోదించిన ఫిబ్రవరి 16 చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆర్ధికంగా రాజకీయంగా, సామాజికంగా బలహీనవర్గాలు ఎదగాలనే ఆలోచనతో కులగణన తీర్మానం చేశామని మంత్రి వివరించారు. ఆ తీర్మానంపై మాజీమంత్రి గంగుల కమలాకర్... అనుమానం వ్యక్తం చేయడం సరికాదని పొన్నం సూచించారు. భారాస ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే అంశాలను బయట పెట్టాలని ఏ రోజైనా గంగుల అప్పటి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారా అని పొన్నం నిలదీశారు.

అయితే అసెంబ్లీలో కేవలం కులగణన తీర్మానం పెట్టి ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ MLC కవిత ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల వచ్చే లోపు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా 29వేలమంది బీసీలకు రాజకీయంగా అవకాశాలు వస్తాయన్న కాంగ్రెస్...ఇప్పుడు కంటితుడుపు చర్యగా ఒక తీర్మానం చేసి ఆఅంశాలని పక్కకుపెట్టిందని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పిస్తామని ప్రతి ఏడాది 20వేల కోట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ .... ఇప్పుడు రెండు అసెంబ్లీ సమావేశాలు జరిగినా...... ఉపప్రణాళిక ఊసే ఎత్తడంలేదని విమర్శించారు. బీసీ కులగణన ఎప్పుడు మొదలు పెడతారు ఏ సంస్థ ద్వారా చేస్తారనే అంశాలపై స్పష్టతలేకుండా తీర్మానం చేస్తే ఏం ఉపయోగమేంటని కవిత ప్రశ్నించారు.

ఇటీవలే తెలంగాణలో సమగ్ర కుల గణన సర్వే చేయాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. కుల గణన కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల అభ్యన్నతి, ప్రణాళికల కోసం సర్వే చేయనున్నట్లు తీర్మానంలో వెల్లడించారు. బలహీన వర్గాలను బలోపేతం చేసి... పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే తమ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించిన కేటీఆర్...చట్టం లేదా కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. కుల గణన కోసం చట్టం అవసరం లేదని.. చిత్తశుద్ధి చాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

కుల గణన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి కుటుంబ సర్వే చేయాలని తెలంగాణ శాసనసభ తీర్మానించింది. కుల గణనపై తీర్మానం ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన ప్రణాళికల కోసం ఈ సర్వే చేయనున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు. బలహీన వర్గాలను బలోపేతం చేసి.. పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన నిధులను కేటాయించి బలహీన వర్గాలను ఆర్థికంగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపెట్టకుండా.. రహస్యంగా దాచి పెట్టి ఎన్నికలప్పుడు రాజకీయంగా వాడుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story