TS News: తెలంగాణలో 625 నామినేషన్లు ఆమోదం

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పర్వం జోరందుకుంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా.. దాఖలైన అఫిడవిట్ల పరిశీలన కూడా అధికారులు పూర్తి చేశారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాత ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి.. ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి.. చివరకు ఎన్ని ఆమోదం పొందాయన్న వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు 625 నామినేషన్లను ఆమోదించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 893 మంది 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 268 మందికి చెందిన 428 సెట్లను ఈసీ తిరస్కరించింది. మల్కాజ్‌గిరిలో 114 మంది నామినేషన్లు దాఖలు చేయగా 77 తిరస్కరణకు గురయ్యాయి. మెదక్‌లో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. మెదక్‌లో 53, ఆదిలాబాద్‌లో 13, పెద్దపల్లిలో 49, కరీంనగర్‌లో 33, నిజామాబాద్‌లో 32, జహీరాబాద్‌లో 26, సికింద్రాబాద్‌లో 46, హైదరాబాద్‌లో 38, చేవెళ్లలో 46, మహబూబ్ నగర్‌లో 35, నాగర్ కర్నూలులో 21, నల్గొండలో 31, భువనగిరిలో 51, వరంగల్‌లో 48, మహబూబాబాద్‌లో 25, ఖమ్మంలో 41 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఆదిలాబాద్‌లో 10, పెద్దపల్లిలో 14, కరీంనగర్‌లో 20, నిజామాబాద్‌లో 10, జహీరాబాద్‌లో 14, సికింద్రాబాద్‌లో 11, హైదరాబాద్‌లో 19, చేవెళ్ళలో 18, మహబూబ్ నగర్‌లో 7, నాగర్ కర్నూలులో 13, నల్గొండలో 25, భువనగిరిలో 10, మహబూబాబాద్‌లో 5, ఖమ్మంలో 4, వరంగల్‌లో 10 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
తిరస్కరణకు గురైన నామినేషన్ల వివరాలు..
మరోవైపు.. ఆదిలాబాద్‌లో 10, పెద్దపల్లిలో 14, కరీంనగర్‌లో 20, నిజామాబాద్‌లో 10, జహీరాబాద్‌లో 14, సికింద్రాబాద్‌లో 11, హైదరాబాద్‌లో 19, చేవెళ్లలో 18, మహబూబ్ నగర్‌లో 7, నాగర్ కర్నూలులో 13, నల్గొండలో 25, భువనగిరిలో 10, మహబూబాబాద్‌లో 5, ఖమ్మంలో 4, వరంగల్‌లో 10 నామినేషన్లను తిరస్కరణకు గురైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com