Numaish 2022: ఈ ఏడాది నుమాయిష్ లేనట్టే..

X
Numaish 2022: ఆల్ ఇండియా 81వ నుమాయిష్ ప్రదర్శన ఈ ఏడాది పూర్తిగా రద్దయింది. ఈ నెల 1న గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ నుమాయిష్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో నుమాయిష్‌ను రద్దు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఎగ్జిబిషన్ సొసైటికి నోటీసులు ఇచ్చింది. నుమాయిష్ మూసివేయాలని నిర్వహకులకు సూచించారు సీపీ సీవీ ఆనంద్.
రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో ఇప్పటికే నుమాయిష్‌కు ప్రజల సందర్శనను నిలిపివేశారు. తాజాగా పోలీసులు సైతం నోటీసులు జారీ చేయడంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎగ్జిబిషన్ మూసివేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
