మాసబ్ ట్యాంక్‌ ఫ్లై ఓవర్ పై.. ఆయిల్‌ట్యాంకర్‌ బోల్తా

మాసబ్ ట్యాంక్‌ ఫ్లై ఓవర్ పై.. ఆయిల్‌ట్యాంకర్‌ బోల్తా
హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో ఆయిల్‌ట్యాంకర్‌ బోల్తా పడింది.

హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో ఆయిల్‌ట్యాంకర్‌ బోల్తా పడింది. మాసబ్ ట్యాంక్‌ ఫ్లై ఓవర్ ప్రారంభంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో భారీగా ఆయిల్ రోడ్డుపై పడింది. గమనించని కొందరు వాహనదారులు వేగంగా వెళ్లి జారీ పడ్డారు. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిందన్న సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది హుటాహుటిన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రోడ్డుపై ఆయిల్ పడిన చోట మట్టిపోస్తున్నారు. వాహనదారులు జారీపడకుండా చర్యలు చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో.. లక్డీకపూల్ - మెహదీపట్నం రూట్‌లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Tags

Next Story