Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్‌కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది..

Tamilisai Soundararajan: తెలంగాణలో మరోసారి ప్రోటోకాల్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. గవర్నర్ తమిళిసై సౌందరా రాజన్... భద్రాద్రి శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవానికి వెళ్లారు. ఐతే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్ గైర్హాజర్ కావడం చర్చనీయాంశం అయింది. వారు సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ అంశంపై స్పందించేందుకు గవర్నర్ నిరాకరించారు. శ్రీరామ పట్టాభిషేకానికి హాజరయ్యేందుకే వచ్చానన్నారు.
ప్రోటోకాల్ విషయంలో ఇప్పటికే కేసీఆర్ సర్కారు తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు గవర్నర్ తమిళిసై. కేంద్రం సైతం దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపింది. అయినా కూడా గవర్నర్‌కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది తలెత్తడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక రాములవారి పట్టాభిషేకంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు గవర్నర్ తమిళిసై.
తెలంగాణ ప్రజానీకం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాముల వారిని మీ తెలంగాణ సోదరిగా మొక్కుకున్నానని అన్నారు. కొవిడ్ నాలుగవ దశ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని కోరారు. అనంతరం భద్రాచలంలో శిశు సంక్షేమ శాఖ, వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీమంతాల కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. దీంతో ఆ ప్రాంతం సందడిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com