మరోసారి వాయిదా పడ్డ టీపీసీసీ చీఫ్‌ ఎంపిక?

మరోసారి వాయిదా పడ్డ టీపీసీసీ చీఫ్‌ ఎంపిక?
X
తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎవరన్నది తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పుడే అధ్యక్షుడి పేరు ప్రకటించరాదని అధిష్టానం నిర్ణయించినట్లుగా సమాచారం.

తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎవరన్నది తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పుడే అధ్యక్షుడి పేరు ప్రకటించరాదని అధిష్టానం నిర్ణయించినట్లుగా సమాచారం. ఒకవేళ ఇప్పుడే పీసీసీ చీఫ్‌ ప్రకటన చేస్తే పార్టీలో విబేధాలు తలెత్తుతాయని ఆ ప్రభావం సాగర్‌ ఉపఎన్నికపై ఉంటుందంటూ నల్గొండ జిల్లాకే చెందిన ఓ సీనియర్‌ నేత అధిష్టానానికి ఫోన్‌ చేశారు. ఎవరి పేరు ప్రకటించకపోవడమే మేలంటూ అభిప్రాయపడ్డారు. ఆయన భావనతో ఏకీభవించిన అధిష్టానం పీసీసీ అధ్యక్షుడి ప్రకటన నిలిపివేసింది.

Tags

Next Story