Kamareddy: తల్లీకొడుకు సూసైడ్ కేసులో మరో కొత్త పేరు తెరపైకి..

Kamareddy: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెదక్ జిల్లా రామయంపేటకు చెందిన తల్లీకొడుకు సూసైడ్ కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. సంతోష్ స్నేషితుడు బాషం శ్రీనివాస్... ఘటన జరిగిన రోజు నుండి కనిపించకుండా పోయారు. ప్రాణస్నేహితుడి అంత్యక్రియలకూ హాజరుకాలేదు. దీంతో బాషం శ్రీనివాస్ అజ్ఞాతంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రాణ స్నేహితులు రియల్ ఎస్టేట్ వ్యాపారమూ కలిసే చేసినట్లుగా సంతోష్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఓ ప్లాట్ డబ్బు విషయంలోఏర్పడిన మనస్పర్ధల కారణంగా శ్రీనివాస్... మున్సిపల్ ఛైర్మన్ జితేందర్‌గౌడ్‌తో కలిసి దెబ్బకొట్టారని అనుమానిస్తున్నారు. తల్లికొడుకు మృతికి శ్రీనివాస్‌కు ఏదో సంబంధం ఉందన్న అనుమానం బలపడుతోంది.
జితేందర్‌గౌడ్, సరాఫ్ యాదగిరిల వేధింపుల గురించి, సంతోష్ పడ్డ ఇబ్బందుల గురించి పూర్తి వివరాలు శ్రీనివాస్ వద్ద ఉండే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. ఆ కారణంగానే శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్లాడని భావిస్తున్నారు. శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com