తెలంగాణలో కొనసాగుతున్న 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాల్టీల పోలింగ్..!

తెలంగాణలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాల్టీలకు పోలింగ్ కొనసాగుతోంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లకు మొత్తం 502 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 6 లక్షల 53వేల 240 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 878 పోలింగ్స్టేషన్లు, 561 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 46 కేంద్రాల్లో లైవ్‌వెబ్ క్యాస్టింగ్నిర్వహిస్తున్నారు.
ఇక 231 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల తీరును పర్యవేక్షించనున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు... సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 5వేల 320 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా 800 మందికి ఓ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. నగరంలోని 37 సమసస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు బందోబస్తు చేస్తున్నాయి.
ఇటు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటు్ననారు. మొత్తం 60 డివిజన్లకు గానూ... 251 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2 లక్షల 90 మంది ఓటర్లు ఉండగా.. 76 పోలింగ్ బూత్‌లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఓటర్లు భౌతిక దూరం పాటించేలా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇక సిద్దిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు కూడా పోలింగ్ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com