KTR Open Letter : కేంద్రమంత్రి బండి సంజయ్ కి కేటీఆర్ బహిరంగ లేఖ

KTR Open Letter : కేంద్రమంత్రి బండి సంజయ్ కి కేటీఆర్ బహిరంగ లేఖ

సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay ) కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ( KTR ) కోరారు. ఈ మేరకు ఆయన సంజయ్ కు ఆయన లేఖ రాశారు. కేంద్రంలో బీజేపీ సారద్యంలోని ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ప్రధాని మోడీని ఒప్పించి సిరిసిల్లా మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, మీరు ఈ ప్రాంత ఎంపీగా ఐదేళ్ల క్రితం ఎన్నికయ్యారు కానీ నేతన్నలకు ప్రతిసారి నిరాశానే ఎదురైందన్నారు.

గతంలో పదేళ్లుగా సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను తీసుకొచ్చేందుకు తాను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదన్నారు. సుమారు పదిసార్లు కేంద్రంలో స్మ్రతి ఇరానీ, అరుణ్ జైట్లీ వంటి అనేతక మంది మంత్రులను నేను స్వయంగా కలిసినా దక్కింది శూన్యం అన్నారు. బండి సంజయ్ ని కూడా ఎన్నోసార్లు ఈ అంశంలో సహకారం అందించాలని కోరినప్పటికీ మీరు పట్టించుకోలేదన్నారు. అయితే రెండోసారి మీరు ఎంపీ కావటం, కేంద్రంలో కూడా మంత్రిగా పదవి దక్కటంతో సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు మీకిది సరైన సమయం అని గుర్తించండి అని తెలిపారు.

ఈ సారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న ఈ బడ్జెట్ లో సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్ లూమ్ కస్టర్ ను ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని, ఉపాధి లేక ఇక్కడి కార్మికులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సంగతి మీరు గుర్తించండన్నారు. గత ప్రభుత్వం నేతన్నల కోసం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ సర్కారు పాతరేయడంతో చేనేత రంగం మరోసారి పదేళ్ల తర్వతా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు.

Next Story