Water Dogs: నాగార్జున సాగర్ జలాశయంలో అరుదైన జీవుల సందడి

Otters
Water Dogs: నాగార్జున సాగర్ జలాశయంలో నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సాగర్ జలాశయంలోకి వరదనీరు వస్తోంది. దీంతో అత్యంత అరుదుగా కనిపించే నీటి కుక్కలు.. జలాశయం దగ్గరికి చేరుకున్నాయి. చేపలను ఆహారంగా తీసుకునే ఈ ఆటర్స్... ఉభయ చర జీవులు. ఈ మధ్య కాలంలో నీటి కుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని..రిజర్వాయర్ పరిసరాల్లో అక్కడక్కడ కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ జీవులు ముంగిసలాంటి తల కలిగి ఉన్నాయి. మెడ భాగం చూస్తే సీల్ ఫిష్ గుర్తొస్తుంది. వీటిని నీటి కుక్కలని పిలుస్తారు. వీటిని అట్టర్ అని కూడా పిలుస్తారు. పెద్దగా అలికిడి లేని నీటి వనరులున్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. నీటితో పాటు నేలపైనా ఉండగలవు. ఈ జీవులు ప్రధానంగా చేపలను తింటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com