డీసీఎం వ్యాన్ బోల్తా.. 80 గొర్రెలు మృతి

X
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో డీసీఎం వ్యాన్ బోల్తా పడడంతో 80 గొర్రెలు మృతిచెందాయి. పెరుమలసంకీస సమీపంలో గూడూర్ నుంచి ఖమ్మం జిల్లా మధిరకు డీసీఎం వ్యాన్‌లో గొర్రెలను తరలిస్తున్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యంతోనే డీసీఎం అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. స్పాట్‌లోనే 80 గొర్రెలు మృతిచెందగా.. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనలో మృతిచెందిన గొర్రెల విలువ సుమారు 8లక్షల ఉంటుందని అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
