kinnera mogilaiah : ఎవరీ మొగిలయ్య.. పూట గడవని స్థితి నుంచి పద్మశ్రీ వరకు..!

kinnera mogilaiah : నల్లమల ముద్దు బిడ్డ... కిన్నెరనాదమై అలరించే మొగిలయ్యకు అరుదైన పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నతమైన వ్యక్తిత్వాలకు అందించే పద్మశ్రీ అవార్డుకు... మొగిలయ్య ఎంపికయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా అవుసలికుంటకు చెందిన మొగిలయ్య... కిన్నెరనాదం ప్రతిభతో తెలుగు ప్రజల మనసు దోచుకున్నారు.
గ్రామగ్రామానా తిరిగి... అందంగా ముస్తాబు చేసిన కిన్నెర వాయిద్యంతో అందరినీ అలరించే స్థాయి నుంచి తెలుగు సినిమా పాటలు స్థాయికి ఎదిగారు. ఆయన ప్రతిభను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కూడా.. ఎన్నో సత్కారాలు అందించింది. ఆర్టీసీ బస్సులపై కూడా ఆయన పాడిన పాటకు... ప్రభుత్వం ఫిదా అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా... ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించడానికి బస్ పాస్ కూడా ఇచ్చారు.
తెలకపల్లి మండలం గుట్టరాయిపాకులలో పుట్టిన మొగిలయ్య... తన తాత, తండ్రి నుంచి కిన్నెరవాయిద్యం నేర్చుకున్నారు. తర్వాత అవుసలికుంటలో స్థిరపడ్డారు. పూట గడవని స్థితిలో... కిన్నెర కళనే నమ్ముకుని... స్కూళ్లలో ప్రదర్శనలు ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక... ఆయన ప్రతిభకు గౌరవం దక్కింది. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీకి ఎపింక చేయడంతో... హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. తనకు ఇంతటి గౌరవం దక్కడంతో... మొగిలయ్య ఆనందానికి అవధుల్లేవు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com