Congress: కాంగ్రెస్‌లో పాలేరు టికెట్‌కు ఫుల్ డిమాండ్

తెలంగాణ కాంగ్రెస్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గ టికెట్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అగ్ర నేతలు నేనంటే నేను అంటూ ప్రకటనలు చేస్తుండటంతో పోటీలో నిలిచేదెవ్వరన్న ఉత్కంఠ పెరిగిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పాలేరులో గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఉపేందర్ రెడ్డికే ఆ పార్టీ టికెట్ లభించింది. అయితే కాంగ్రెస్‌లో మాత్రం పోటీ నెలకొంది.
పాలేరులో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన షర్మిల..ఇవాళ ఢిల్లీలో సోనియా,రాహుల్ ను కలిశారు. ఇప్పటికే పాలేరులో గ్రౌండ్ వర్క్ చేసుకున్న షర్మిల ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్ నేత తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరి పాలేరులో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి ఎలాగైనా పాలేరు బరిలో ఉండాలని తుమ్మలపై అనుచరుల ఒత్తిడి తెస్తున్నారు. అటు పాలేరుపైనే ఫోకస్ పెట్టారు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మొదట కొత్తగూడెం, ఖమ్మం వైపు ఆసక్తి చూపినా .. చివరికి పాలేరు వైపే చూపుతున్నారు. అయితే అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందన్న ఆసక్తి నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com