ఈటలకు పల్లా కౌంటర్..

బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి చట్ట వ్యతిరేకమైన దేవాదాయ భూములు, అసైన్డ్ భూములు ఎలా కొంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ను ప్రశ్నించారు. బీజేపీలో చేరనున్న ఈటల ఎక్కువ కాలం ఆ పార్టీలో కొనసాగలేరని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనమంటే సీఎం కేసీఆర్ వద్దన్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. కానీ ధాన్యం సేకరణ అనేది కచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని కాదన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందన్నారు. కరోనా రివ్యూలో తాను లేకుండా సీఎం ఒక్కరే చేశారంటూ ఈటల చేసిన ఆరోపణలు అవాస్తవం అని పల్లా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం మానిటరింగ్ చేస్తూ ఈటలకు ఇబ్బంది కాకుండా చూశారని పల్లా తెలిపారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ అధికారులను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసింది గుర్తు లేదా అని పల్లా ఈటలపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీకు దక్కినన్ని పదవులు మరెవరికీ దక్కలేదని ఈటలను ఉద్దేశించి పల్లా వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com