Paper Boy Sriprakash : పేపర్ వేస్తే తప్పేంటి.. ఆ మాటల వెనుక అతడి తల్లి ఉద్దేశం ఏంటి?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు పేరు శ్రీప్రకాశ్ గౌడ్.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది ఆరో తరగతి.. కానీ ప్రపంచాన్ని చదివేశాడు. కష్టేఫలి అని సిద్దాంతాన్ని బాగా నమ్ముకున్నాడు.. నమ్ముకోవడమే కాదు.. దానిని పక్కగా ఆచరణలో పెడుతున్నాడు కూడా.. పొద్దునే లేచి పేపర్ వేయడం అలవాటు చేసుకున్నాడు.
చక్కగా స్కూల్ కి వెళ్లి చదువుకోవాల్సిన వయసులో ఇలా పనిచేయడం ఏంటని ఓ వ్యక్తి అడిగితే.. పేపర్ వేస్తే తప్పేంటని ప్రశ్నించి అందరిని ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ బుడ్డోడి మాటలకి మంత్రి కేటీఆర్ కూడా ఫిదా అయిపోయారు... మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
శ్రీప్రకాశ్ పేపర్ బాయ్ గా చేస్తే వచ్చే డబ్బులు వాస్తవానికి ఆ కుటుంబానికి అవసరం లేదు.. కానీ చిన్నప్పటి నుంచే కష్టపడటం అలవాటు చేసుకుంటే మంచిది.. తద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నది ఆ తల్లి ఆలోచన.
అందుకే తన పెద్ద కొడుకులాగే చిన్న కొడుకును కూడా పేపర్ బాయ్ ని చేసింది ఆ తల్లి. పేపర్ బాయ్ గా చేయడం వలన పొద్దున్నే లేవటం అలవాటుగా చేసుకొని ఉదయం నుంచే సమాజాన్ని గమనిస్తాడన్నది ఆ బుడ్డోడి తల్లి చెప్పుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com