కీచక టీచర్.. విద్యార్ధినిలకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ..

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే పాడు బుద్ధిని ప్రదర్శించాడు. విద్యార్ధినిలకు చదువు చెప్పాల్సింది పోయి వారికి అశ్లీల చిత్రాలు చూపిస్తూ శారీరకంగా లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అదిలాబాద్ జిల్లా తాంసి మండలం గొట్కురి సెకండరీ పాఠశాలలో పనిచేస్తోన్న ఉపాధ్యాయుడు ఖదీర్ తరగతి గదిలో విద్యార్ధినిలకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్ధినిలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని గదిలో బంధించారు. అతడి నిర్వాకంపై నిలదీశారు.
ఉపాధ్యాయుడిపై MEO కు ఫిర్యాదు చేయడంతో ఆయన పాఠశాలకు వచ్చి విచారణ జరిపారు. విచారణలో సదరు ఉపాధ్యాయుడిపై విద్యార్ధినిలు చేసిన ఆరోపణలు నిజమని రుజువు కావడంతో DEO కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఉపాధ్యాయుడు ఖదీర్‌ను సస్పెండ్ చేశారు.
విద్యార్ధినిల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కీచక టీచర్ ఖదీర్‌పై కేసు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com