Chanchalguda Jail: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేసులో నిందితులను కలిసిన తల్లిదండ్రులు..

X
Chanchalguda Jail: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో అరెస్టు అయి రిమాండ్‌లో ఉన్న నిందితులను ములాఖత్‌లో కలిసేందుకు చంచల్‌గూడ జైలుకు తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు. తమ పిల్లలు పరిస్థితిపై చంచల్ గూడా జైలు వద్ద తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. రాష్ట్రప్రభుత్వమే జోక్యం చేసుకుని తమ పిల్లల్ని బయటకు తీసుకరావాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. అటు అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారి సాయి ఢిపెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావుకు బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుబ్బారావును రిమాండ్‌కు ఆదేశించటంతో ఆయన ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
