Manohar Naidu: గుంటూరు మేయర్, వైసీపీ నేత మనోహర్ నాయుడుల పై కేసు

వైసీపీ నేత, గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుపై కేసు నమోదయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై గతంలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేత కనపర్తి శ్రీనివాసరావు గుంటూరులోని అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు వివరాల్లోకి వెళితే... గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో టీడీపీ, జనసేన శ్రేణులు అరండల్ పేట ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆ సమయంలో మనోహర్ నాయుడు అక్కడకు చేరుకుని వీరంగం వేశారు. పోలీసుల లాఠీ తీసుకుని విపక్ష నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను దూషించారు. అప్పట్లో మనోహర్ నాయుడుపై టీడీపీ, జనసేన ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. తాజాగా కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో... మనోహర్ నాయుడుతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com