ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకొస్తాయా : రేవంత్‌రెడ్డి

X
సీఎం కేసీఆర్‌కు ఎన్నికలప్పుడే పథకాలు గుర్తుకొస్తాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎక్కడ ఉపఎన్నికలుంటే అక్కడ పథకాలు తెస్తారా అని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. రాష్ట్రంలోని కోటి 35 లక్షల మందికి దళిత, గిరిజనులకు దళిత బంధు పథకం ఇవ్వాలన్న రేవంత్.....దళితులను మోసం చేసి ఓట్లు డబ్బాలో వేసుకుంటామంటే చూస్తూ ఊరుకునేదిలేదన్నారు. ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు దళిత గిరిజన దండోరా మోగించనున్నట్లు తెలిపిన రేవంత్‌రెడ్డి...ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచి లక్షమందితో కార్యక్రమం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
