Congress Vari Deeksha: కాంగ్రెస్ చేపట్టిన వరి దీక్షలో ఆసక్తికర సన్నివేశం..

X
Congress Vari Deeksha: కాంగ్రెస్ చేపట్టిన వరి దీక్షలో ఆసక్తికరసన్నివేశం కనిపించింది. ఎప్పుడూ నువ్వా నేనా అన్నట్లుగా ఉండే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కపక్కనే కూర్చున్నారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇద్దరు ఒకే వేదికపై పక్కపక్కనే కనిపించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్‌కు ఇవ్వడంపై గతంలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఐతే కోమటిరెడ్డిని బుజ్జగించే బాధ్యతను పార్టీ సీనియర్ నేత వీ.హెచ్‌కు అప్పగించింది పార్టీ అధిష్టానం. వీ.హెచ్ మంత్రాంగం ఫలించడంతో కోమటిరెడ్డి దీక్షకు హాజరైనట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
