Tankband : సందడిగా మారిన హైదరాబాద్ ట్యాంక్‌బండ్ ..!

హైదరాబాద్ ట్యాంక్ బండ్ సందడిగా మారింది. ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో.. సంన్ డే ఫంన్‌డేను నగర వాసులు ఎంజాయ్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో ఫ్యామిలీ, పిల్లలతో ట్యాంక్ బండ్ కళకళలాడుతోంది. ట్యాంక్ బండ్‌పై కాలక్షేపం చేసేలా మార్పు చేయాలని.. ఓ నెటిజన్ కోరడంతో స్పందించిన మంత్రి కేటీఆర్ చర్యలు తీసుకున్నారు. దీంతో నగరవాసులు భారీగా ట్యాంక్ బండ్ పైకి వచ్చారు. సందర్శకులకు ఆహ్లాదం పంచేందుకు ఆర్మీ బ్యాండ్, లేజర్ షో ఏర్పాటు చేశారు. మరోవైపు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 20వేల మొక్కలను పంపిణీ చేశారు. ఇక పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలాలు, ప్రత్యేకంగా ఫుడ్ ట్రక్స్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు.. మొబైల్ టాయిలెట్స్.. అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. దీంతో నగర వాసులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com